భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు బౌద్ధమతంలో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు. కమ్యూనిస్టులు ప్రాధమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం... ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.
నాస్తిక సూత్రాలు
- ఆస్తికుల దృక్పథం విశ్వంనుంచి ప్రారంభమై మనిషి వరకూ వస్తుంది. నాస్తికుల దృక్పథం మనిషినుంచి ప్రారంభమై విశ్వంవైపు వెళ్తుంది.
- ఆస్తికులు కష్టనష్టాలకు దేవుడిని, సంఘాన్ని, ప్రభుత్వాన్ని కారకులుగా భావిస్తారు. ఆస్తికులు తాము సంఘంలో ఒక భాగం అనుకొంటారు. అయితే నాస్తికులు సంఘం, ప్రభుత్వం... వంటివన్నీ తమలో ఒక భాగంగా భావిస్తారు. అందువల్ల నాస్తికులకు జీవితం పట్ల స్తబ్దత పోయి శ్రద్ధ కలుగుతుంది! తామ చేసే పని గురించి ఆలోచిస్తారు. వాస్తవిక విజ్ఞాన దృష్టి పెరుగుతుంది. సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. సామాజిక దృష్టి ఎక్కువవుతుంది. నాస్తికులకు యుద్ధాలు, దౌర్జన్యాలు పట్ల ఆసక్తి ఉండదు. సాటి మనుషులపట్ల ద్వేషం ఉండదు. మత కలహాలుండవు. నియంతృత్వ భావనలుండవు. సమానత్వం, స్వేచ్ఛ, వాస్తవిక విజ్ఞానం, నీతివర్తనం అలవడతాయి.
- ఆస్తికులు బానిస విధానానికి అలవాటుపడ్డారు. కాబట్టి వారికి సమానత్వం చేతకాదు. ఎక్కువ తక్కువలనేవి వారికి ఎప్పుడూ ఉంటాయి. నాస్తిక చైతన్యంవల్ల మతాలు, జాతులు, వర్గాలు అనే భేదాలుండవు.
- ఆస్తికులు బానిసలు కాబట్టి తమకు స్వేచ్ఛ అక్కర్లేదని యజమానుల పాదాలకు మొక్కుతుంటారు. ఈ యజమానులు ఎవరైనా కావచ్చు. మతపెద్దలు కావచ్చు. మత ప్రవక్తలు, నీతిబోధకులు, అవతార పురుషులు ప్రభుత్వ నాయకులు ఇలా ఎవరైనా కావచ్చు. అయితే నాస్తికులు స్వతంత్య్ర జీవనం కోరుకుంటారు కాబట్టి వారు ఎవరికీ లొంగి ఉండరు. వాస్తవాలను నిర్భయంగా ఎదుర్కొంటారు.
- బానిసలకు సహకారం, పరస్పర గౌరవం చేతకాదు. ప్రజాస్వామిక జీవనం నాస్తికులకే సాధ్యం.
- ప్రభుత్వం ఏదైనా ప్రజలందరికీ సమానమే. వారు ధనికులైనా, పేదలైనా ఏ కులం, మతం, జాతికి చెందినవారైనా వృద్ధులు, పురుషులు, స్త్రీలు... ఎవరైనా అందరికీ సమానంగా చెందుతుంది. అయితే ఆస్తికులు తమ బానిస ప్రవృత్తివల్ల అలా ఆలోచించక అది కొందరికే చెందిందనుకుంటారు. నాస్తికులు అందుకు భిన్నంగా ఆస్తికులు ప్రభుత్వం ద్వారా సాధించలేని ఫలితాలను సాధించగలుగుతారు.
- ధనికులు నాస్తికులవడానికి ఇష్టపడరు. పైగా నాస్తికత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారికి దేవుడిమీద నమ్మకమున్నా లేకున్నా ప్రజల్లో మత విశ్వాసాలను మాత్రం పోషిస్తారు. అసమానతలు తొలగిపోకూడదన్నదే వారి లక్ష్యం. దేవుడు, మతం ఇవన్నీ వారికి కుంటి సాకులే.
- నాస్తికత్వం ఎంత త్వరగా వ్యాపిస్తే అంత వేగంగా వ్యవస్థలోంచి నియంతృత్వాలు తొలగిపోతాయి.
- ఎవర్నీ దేవుడు సృష్టించలేదు. అసలుంటే కదా ఆయన సృష్టించడానికి మానవుల కష్టాలకీ - దేవుడికీ ఏవిధమైన సంబంధం లేదు. ఎంతో కాలంనుంచీ దేవుళ్లని ప్రార్థిస్తున్నవారు తమ కష్టాల్ని దేవుడు తీర్చాడని నిరూపించగలరా? ఎక్కడాలేని దేవుడు కష్టాలు ఎలా తీరుస్తాడు?
- మత నమ్మకాలే ప్రజల్ని పాలిస్తున్నాయి. కర్మ అనుకునే మనస్తత్వమే నూటికి తొంభైమంది ప్రజల్ని నిరుపేదలుగా ఉంచుతోంది. ఈ మతాలు కలిగించే భావదాస్యమే ఆర్థిక దాస్యానికి కారణం. ప్రజల్లో మూఢనమ్మకాలు, మతభావాలు లేకుండా చెయ్యగలిగితే దోపిడీ దానంతట అదే పోతుంది.
- ప్రకృతిలో నియమాలంటూ లేవు. మానవుడు ప్రకృతిని చూసి తన బుద్ధి కుశలత వలన దాన్ని అర్థంచేసుకుంటున్నాడు. అప్పుడు కొన్ని నియమాలు ప్రకృతికి ఉన్నాయని ఊహించి, వాటిని ప్రకృతికి ఆరోపించి వాటి ద్వారా ప్రకృతిని అర్థం చేసుకొంటున్నాడు

కొన్ని పద్యాలు:-
మీది ఏ త్వం?
.
ఉన్నది అన్నది
………..ఆస్తికత్వం
ఉన్నది అన్నది లేదన్నది
………..నాస్తికత్వం
ఉందో లేదో అన్నది
………..చపలత్వం
ఉంటే ఉంది లేకపోతే లేదన్నది
………..తెలివైన తత్వం
ఉన్నది లేనిది రెండూ నీవే అన్నది
………..వేదాంత తత్వం
ఉన్నదాన్ని వదిలేసి లేనిదాన్ని ఊహించడం
………..భావుకత్వం
లేనిదాన్ని వదిలేసి ఉన్నదాన్ని ప్రేమించడం
………..మానవత్వం
ఒక మిత్రుడు నన్నడిగాడు.ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని.
ఈ ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది.
ఆస్తికత్వం, నాస్తికత్వం అనెవి మన నమ్మకాలకు చెందిన విషయాలు. కాని మంచితనం అలా కాదు. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. హృదయానికి సంబంధించిన విషయం.
ప్రపంచంలొ మహా భక్తులుగా చెలామణీ అవుతున్న వారిలో పెద్ద దొంగలు, దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మంచి వారూ చాలామంది ఉన్నారు. అలాగె నాస్తికులలో కూడాను. కనుక ఈ రెండూ భిన్న విషయాలు. పోల్చలెనివి.
ఒక మనిషి బాధలో ఉన్నపుడు స్పందించి ఆ బాధను తనదిగా భావించి సాయం చెయ్యటం మంచితనం. మానవత్వం. దీనికి కావలసింది స్పందించే హృదయం. అసలు, మనిషి ఆస్తికుడా నాస్తికుడా అనేది ప్రశ్నే కాదు. మనిషి మనిషి గా ఉన్నాడా లెదా అనేదే ప్రశ్న.
ఒక మనిషి గనక పరిపూర్ణ మానవత్వం తో ఉంటె, అతను నాస్తికుడైనా సరే, దెవునికి అతడే దగ్గర అవుతాడు. అదే స్వార్ధ పరుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చెసినా దెవునికి దగ్గర కాలేడు. కనుక మనిషి స్వార్ధ పరుడా, లెక నిస్వార్ధ పరుడా అనెదె ముఖ్యం కాని, అతడు దెవుని నమ్ముతున్నాడా లెదా అనెది ముఖ్యం కాదు.
ఈ స్వార్ధం లెకుండా మనిషి ఉండగలడా? జీవించాలంటె ఎంతో కొంత స్వార్ధం అవసరం. కాని మితిమీరిన స్వార్ధం అవసరం లెదు. తన కడుపు నిండిన తరువాత కూడా ఎదుటి వాడి కడుపు కొట్టాలనుకోవటం తప్పు. కాని తన కడుపు ఎప్పుడు నిండుతుందో, ఎంత తింటే నిండుతుందో కూడా తెలియని స్థితిలో మనిషి బతుకుతున్నాడు. కనుకనే మితిమీరిన స్వార్ధం తొ అన్నీ తనకె చెందాలనే తపనతో భ్రమతో ఎక్కడికి పొతున్నాడో తెలియని స్థితిలో సాగిపొతున్నాడు.
ఇటువంటి మనిషి దెవుని నమ్మినా నమ్మక పొయినా పెద్ద తెడా లెదు. మన రాజకీయ నాయకులు అందరూ దైవ భక్తులే. కాని ఉపయోగం ఎముంది? సమాజంలొ మోసగాళ్ళు అందరూ దైవ భక్తులే. ప్రయోజనం ఎముంది. ఇటువంటి భక్తిని దేవుడు మెచ్చడు. భక్తి కన్నా, నమ్మకాల కన్నా మానవత్వం ముఖ్యం.
ఎవరి హృదయం మానవత్వం తొ తొణికిసలాడుతూ ఎదుటి మనిషి బాధను తన బాధగా స్పందించగలిగే స్థాయికి చెరుకుంటుందో అట్టి వాని వద్దకు భగవంతుడే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడు. మానవత్వం లెని ఆస్తికత్వం వ్యర్ధం. విలువలు లెని భక్తీ వ్యర్ధమే.
దురదృష్ట వశాత్తూ ప్రస్తుత సమాజంలో మానవత్వం, ఆస్తికత్వం భిన్న ధ్రువాల లాగా ఉన్నాయి. దెవుని విగ్రహాలలొనే కాదు సాటి మనిషిలో, సాటి జీవులలో చూడలేని వాడు ఆస్తికుడూ కాలేడు, భక్తుడూ కాలేడు. ఇదే మాట నా మిత్రునితో చెప్పాను. మీరేమంటారు?

నాస్తికుల వాదనను తిప్పికొట్టడానికి ఆస్తికులు ఉప్యోగించే ఒక ఆయుధం ఈ వాదన:"నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! దేవుడు ఉన్నాడని మేమెలా నమ్ముతామో, లేదని మీరు అలాగే నమ్ముతారు" అని. మరి ఈ వాదనలో నిజం ఉందా?
నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు. ఏ నమ్మకమూ లేకపోవడమూ కూడా ఒక నమ్మకమే అవుతుందా? ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న మౌల్వీ నసీరుద్దిన్ జోకు లాంటి వాదన. ఏ కారూ లేని వాడి దగ్గరకి వెళ్ళి నువ్వు నోకార్ (no car)కలిగి ఉన్నావు, రోడ్డు టాక్సు చెల్లించాల్సిందే అన్నట్లు.
లేనిదానిని నిరూపించడం అసాధ్యం అవుతుంది. ఎప్పుడైనా నిరూపించాల్సిన భాద్యత ఉన్నదని క్లెయిము చేసే వారిదే. దీనికి బెర్‌ట్రాండ్ రస్సెల్ ఇలా చెప్పాడు: నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్యన ఒక టీ కప్పు తిరుగుతుంది అని చెప్పితే ఎవరైనా ఆకాశం అంతా తిరిగి ఆ టీ కప్పు లేదు అని నిరూపించగలరా? కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు.
No comments:
Post a Comment