హే… కృష్ణా!
క. కన్నాయని పిలువ జనని
దన్నుగ నిలచిన బుడతలు దౌడులు తీయన్
ఉన్నపళము దబ్బునపడ
వెన్నను పొర్లాడు కృష్ణు ప్రియమున కొలుతున్
దన్నుగ నిలచిన బుడతలు దౌడులు తీయన్
ఉన్నపళము దబ్బునపడ
వెన్నను పొర్లాడు కృష్ణు ప్రియమున కొలుతున్
తాత్పర్యము: మిత్రుల భుజములమీదనెక్కి, ఉట్టి కట్టిన వెన్నకుండను తీయబోతున్న తరుణంలో, కన్నా.. యను యశోద పిలుపు వినగానే మిత్రులందరూ భయంతో ఒక్కసారిగా పరుగులెత్తగా, వెన్నకుండతోపాటు దబ్బున పడిపోయి, నేలనొలికిపోయిన వెన్న మొత్తం ఒంటికి అంటుకుపోయిన కృష్ణ పరమాత్మను అత్యంత ప్రేమతో కొలుతును.
No comments:
Post a Comment