Saturday, 22 December 2012

కృష్ణ లీలలు

















హే… కృష్ణా!

క.       కన్నాయని పిలువ జనని
          దన్నుగ నిలచిన బుడతలు దౌడులు తీయన్
          ఉన్నపళము దబ్బునపడ
          వెన్నను పొర్లాడు కృష్ణు ప్రియమున కొలుతున్
తాత్పర్యము:  మిత్రుల భుజములమీదనెక్కిఉట్టి కట్టిన వెన్నకుండను తీయబోతున్న తరుణంలో,  కన్నా.. యను యశోద పిలుపు వినగానే మిత్రులందరూ భయంతో ఒక్కసారిగా పరుగులెత్తగావెన్నకుండతోపాటు దబ్బున పడిపోయి, నేలనొలికిపోయిన వెన్న మొత్తం ఒంటికి అంటుకుపోయిన కృష్ణ పరమాత్మను అత్యంత ప్రేమతో కొలుతును.

పంజాబీ జీవన చిత్రాలు


















ఫోటోగ్రాఫీ

మహాత్మా  గాంధీ




















విష్ణువు నాభిలో నుంచే బ్రహ్మ ఎందుకు పు ట్టాడు ?


 

 విష్ణువు నాభిలో నుంచే బ్రహ్మ ఎందుకు పుట్టాడు ?


















ఎవరైనా ఏదైనా ఒక కొత్త పనిని చేయాలనే సంకల్పంతో ఆ పనిని పూర్తిచేసినట్లయితే దానికి సృష్టికర్త అతడే అవుతాడు. ఏ ఒక్కరి సంకల్పమో కాకుండా సమిష్టి సంకల్పమైతే దానిని ‘ భగవంతుని సృష్టి సంకల్పం’’ అంటారు. సృష్టి సంకల్పం అనేదానికి బ్రహ్మ అని అర్ధం ముంది. అలాగే ఈ సమస్త లోకాలలో దేనికైనా ముఖ్యమైనదీ, కేంద్రమైనదీ, మూలమైనదీ ఈ సంకల్పమే కదా ! కనుక భగవంతుడైన విష్ణుమూర్తి యెక్క కేంద్రమైనటువంటి నాభి (బొడ్డులో)లో నుంచి బ్రహ్మ (సృష్టిసంకల్పం) పుట్టినట్లుగా మను పురాణాలు శాస్తాలు చెబుతున్నాయి.

నిద్రాభంగం ఎంతటి పాపం...!
నిద్రాభంగం ఎంతటి పాపం...!
మహాయుద్దం ముగిసిన తర్వాత వింటి మీద తల ఆన్చి నిద్రిస్తున్న శ్రీమహావిష్ణువును ఎలా నిద్రలేపాలో తెలియలేదు. లేపితే కలిగే నిద్రభంగపాపము, లేపకపోతే దేవతలకి అరిష్టం. అయినా శ్రీ మహాలక్ష్మీదేవి ఎంత నష్టం జరిగినా పరవాలేదనుకుంది. శ్రీ మహావిష్ణువును నిద్రలేపి ఆ దోషాన్ని మాత్రం పొందకూడదనుకుంది. ఈ పాపానికి దేవతలే భయం చెందుతారు. నిద్రాభంగముతోపాటు కథాభంగము, దాంపత్య భంగము, తల్లీ బిడ్డను విడదీయటం వంటివి కూడా మహాపాతకాలు, పాపమంటే పుణ్యం ద్వారా పోగొట్టుకోవచ్చు. పాతకమంటే అనుభవించాల్సిందే. వేరే దారి లేదు.
 

మౌనవ్రతం ఏ విధంగా చేయాలి ?

మౌనవ్రతం ఏ విధంగా చేయాలి ?
అపొహ : కేవలం నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటూ కాగితాల మీద రాతలద్వారా సైగల ద్వారా మాత్రం తను చెప్పాలనుకుంటున్నది తెలియజెప్పటమే ‘‘ మౌనవ్రతం’’ అని అపొహ పడుతుంటారు చాలామంది. వాస్తవం : నిజానికి పైన చెప్పిన విధముగా చేస్తే అది మూగవ్రతం అవుతుంది. గానీ, మౌనవ్రతమవదు. ‘ త్వక్’’ అంటే శరీరంతో ఎవరినీ తాకకుండా, ‘ చక్షు’ అంటే కళ్ళతో దేనినీ చూడకుండా ‘ శ్రోతృ’ అంటే చెవులతో ఏమీ వినకుండా, ‘ జివ్వా’ అంటే నాలుకతో ఏమీ రుచి చూడకుండా, ‘‘ ఆకాశ’’ అంటే మనసుతో ఏమీ ఆలోచించకుండా ’జిహ్వ‘ అంటే మనసుతో ఏమి ఆలోచించకుండా చేసేదే ‘‘ మౌనవ్రతం’’ ఈ రోజుల్లో మౌనవ్రతాన్ని ఆచరించడం కష్టసాధ్యం

గ్రామాలు



పల్లెటూరు
గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం(Hamlet) కంటే పెద్దది
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడునది ఒక గ్రామమవును. గ్రామాలు వాటి మద్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ది చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును

చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలువిస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. షుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.
  • రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
  • అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకుకేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.
  • అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.
  • దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.




గ్రామాల పేర్లు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పేర్లు వాటి పేర్ల తరువాత వచ్చే సఫిక్స్ లను చూస్తే వాటి వర్గీకరణ అర్థమౌతుంది. గ్రామాల పేర్ల తరువాత సాధారణంగా వచ్చే సఫిక్స్‌లు, పల్లె, తాండ, గూడెం, పురం (ఉదా: పిఠాపురం, పెద్దాపురం), పాలెం (ఉదా: సోంపాలెం, రావులపాలెం) ఊరు (ఉదా: పెనుమూరు, పుంగనూరు, రావూరు), సముద్రం (ఉదా: నల్లసముద్రం, రామసముద్రం), చెరువు (ఉదా: నల్లజెరువు, దేవలచెరువు) వగైరా
పల్లెటూరి అందాలు 

పిచ్చుక గూళ్ళు – గిజిగాడి గూళ్ళు




పిచ్చుక గూళ్ళు – గిజిగాడి గూళ్ళు








లేగదూడలు



స్వచ్ఛంగా ఉన్నాయి ఆ పల్లె పైరులూ, గాలీ, నీరూ...అన్నీ



















హరిదాసు











రామరామ క్రిష్ణక్రిష్ణ