ఎవరైనా ఏదైనా ఒక కొత్త పనిని చేయాలనే సంకల్పంతో ఆ పనిని పూర్తిచేసినట్లయితే దానికి సృష్టికర్త అతడే అవుతాడు. ఏ ఒక్కరి సంకల్పమో కాకుండా సమిష్టి సంకల్పమైతే దానిని ‘ భగవంతుని సృష్టి సంకల్పం’’ అంటారు. సృష్టి సంకల్పం అనేదానికి బ్రహ్మ అని అర్ధం ముంది. అలాగే ఈ సమస్త లోకాలలో దేనికైనా ముఖ్యమైనదీ, కేంద్రమైనదీ, మూలమైనదీ ఈ సంకల్పమే కదా ! కనుక భగవంతుడైన విష్ణుమూర్తి యెక్క కేంద్రమైనటువంటి నాభి (బొడ్డులో)లో నుంచి బ్రహ్మ (సృష్టిసంకల్పం) పుట్టినట్లుగా మను పురాణాలు శాస్తాలు చెబుతున్నాయి.
నిద్రాభంగం ఎంతటి పాపం...!
మహాయుద్దం ముగిసిన తర్వాత వింటి మీద తల ఆన్చి నిద్రిస్తున్న శ్రీమహావిష్ణువును ఎలా నిద్రలేపాలో తెలియలేదు. లేపితే కలిగే నిద్రభంగపాపము, లేపకపోతే దేవతలకి అరిష్టం. అయినా శ్రీ మహాలక్ష్మీదేవి ఎంత నష్టం జరిగినా పరవాలేదనుకుంది. శ్రీ మహావిష్ణువును నిద్రలేపి ఆ దోషాన్ని మాత్రం పొందకూడదనుకుంది. ఈ పాపానికి దేవతలే భయం చెందుతారు. నిద్రాభంగముతోపాటు కథాభంగము, దాంపత్య భంగము, తల్లీ బిడ్డను విడదీయటం వంటివి కూడా మహాపాతకాలు, పాపమంటే పుణ్యం ద్వారా పోగొట్టుకోవచ్చు. పాతకమంటే అనుభవించాల్సిందే. వేరే దారి లేదు.
మౌనవ్రతం ఏ విధంగా చేయాలి ?
అపొహ : కేవలం నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటూ కాగితాల మీద రాతలద్వారా సైగల ద్వారా మాత్రం తను చెప్పాలనుకుంటున్నది తెలియజెప్పటమే ‘‘ మౌనవ్రతం’’ అని అపొహ పడుతుంటారు చాలామంది. వాస్తవం : నిజానికి పైన చెప్పిన విధముగా చేస్తే అది మూగవ్రతం అవుతుంది. గానీ, మౌనవ్రతమవదు. ‘ త్వక్’’ అంటే శరీరంతో ఎవరినీ తాకకుండా, ‘ చక్షు’ అంటే కళ్ళతో దేనినీ చూడకుండా ‘ శ్రోతృ’ అంటే చెవులతో ఏమీ వినకుండా, ‘ జివ్వా’ అంటే నాలుకతో ఏమీ రుచి చూడకుండా, ‘‘ ఆకాశ’’ అంటే మనసుతో ఏమీ ఆలోచించకుండా ’జిహ్వ‘ అంటే మనసుతో ఏమి ఆలోచించకుండా చేసేదే ‘‘ మౌనవ్రతం’’ ఈ రోజుల్లో మౌనవ్రతాన్ని ఆచరించడం కష్టసాధ్యం
గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం(Hamlet) కంటే పెద్దది
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడునది ఒక గ్రామమవును. గ్రామాలు వాటి మద్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ది చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును
చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలువిస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. షుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.
రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకుకేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.
అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.
దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
గ్రామాల పేర్లు
ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పేర్లు వాటి పేర్ల తరువాత వచ్చే సఫిక్స్ లను చూస్తే వాటి వర్గీకరణ అర్థమౌతుంది. గ్రామాల పేర్ల తరువాత సాధారణంగా వచ్చే సఫిక్స్‌లు, పల్లె, తాండ, గూడెం, పురం (ఉదా: పిఠాపురం, పెద్దాపురం), పాలెం (ఉదా: సోంపాలెం, రావులపాలెం) ఊరు (ఉదా: పెనుమూరు, పుంగనూరు, రావూరు), సముద్రం (ఉదా: నల్లసముద్రం, రామసముద్రం), చెరువు (ఉదా: నల్లజెరువు, దేవలచెరువు) వగైరా
పల్లెటూరి అందాలు
పిచ్చుక గూళ్ళు – గిజిగాడి గూళ్ళు
పిచ్చుక గూళ్ళు – గిజిగాడి గూళ్ళు
లేగదూడలు
స్వచ్ఛంగా ఉన్నాయి ఆ పల్లె పైరులూ, గాలీ, నీరూ...అన్నీ
తెలుగు భారతదేశం లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార బాష భారతదేశం లో తెలుగు మాట్లాడే 7.4 కోట్ల (2000 సంవత్సరపు లెక్కలు) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోవుంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. 1997 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6.97 కోట్లు మందికి పైగా [2] మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
తెలుగు -ఒక అవలోకనం
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు[3]. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి[4].
తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాష, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
“
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
”
—శ్రీ కృష్ణదేవ రాయలు
“
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతముచూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తాప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.
సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు.భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.
తెలుగువారికి ఆంగ్లము అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఆంగ్లము మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి.
భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి.త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలుచుకున్నారు.
తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) భాషలో ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.
చరిత్ర
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ,గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది[5].
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)
పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.
[మార్చు]తెలుగు, తెనుగు, ఆంధ్రము
ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి[6][7]. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [8].
క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలోవిన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.
ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య
భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక
సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన
రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు
"నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు
దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు
భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.
భాష
స్వరూపము
శబ్దము
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది.
దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి
తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.
అచ్చుల శబ్దాలను చూడండి.
బెలుంగుహలు కర్నూల్ జిల్లా లోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా బావిస్తూన్నారు అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత .
చరిత్ర
బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురుంచి ప్రస్తావించాడు. తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి వల్ల ప్రస్తావన జరగలేదు. 1982డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా చెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామిరెడ్డి, చపతిరెడ్డి, మద్దులేటి అనే ముగ్గురు స్థానికులు సహకరించారు. ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, . అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది.1985 బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది.1999 లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు