Friday, 2 November 2012

బెలుంగుహలు

బెలుంగుహలు 

బెలుంగుహలు కర్నూల్  జిల్లా లోని కొలిమిగుండ్ల  మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ  గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా  బావిస్తూన్నారు అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత .

చరిత్ర

బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురుంచి ప్రస్తావించాడు. తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి వల్ల ప్రస్తావన జరగలేదు. 1982డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా చెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామిరెడ్డి, చపతిరెడ్డి, మద్దులేటి అనే ముగ్గురు స్థానికులు సహకరించారు. ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, . అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది.1985 బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది.1999 లో  రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు

బెలూం గుహల అందాలు

 లోపలికి  వెళ్ళడానికి దారి
లోపలికి దారి చూపిస్తున్న వ్యక్తీ 






గేబర్ హాల్

లోపలికి తోన్గిచుస్తున్న వ్యక్తీ 
వేయి పడగలు కు దారి


బెలుం సప్తసురగుహాలు 

పాతాళగంగా లో శివుడు
పాతాళగంగ 
ఉడలమర్రి 



No comments:

Post a Comment