Wednesday, 31 October 2012

ఉంగరం దొంగ ఎవరు?


ఉంగరం దొంగ ఎవరు?
ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.

ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు "నామనసు బాగాలేదు" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.

"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. "మీమనసు ఎందుకు బావుండ లేదు?" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. "మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.

"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది." అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. "ఊఁ ఏమైనా అర్థం అయిందా!" అడిగాడు అక్బర్ చక్రవర్తి. "అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది" అన్నాడు. "అయితే చెప్పు మా సమస్య?" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. "అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు."అన్నాడు అక్బర్. "ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!"

"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది." అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. "ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది." "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి." అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు." అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అక్బర్ "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. "చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి." అడిగాడు బీర్బల్. "బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి." చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు." మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి." అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. "ఇదిగో ఇక్కడే పెట్టాను" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. "ఆహఁ! అలాగా! సరే... సరే..." అన్నాడు.

బీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. "ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!" అన్నాడు. "చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి." అన్నాడు.

"మహారాజా" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి." అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. "మహారాజా! దొంగ దొరికాడు" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు." అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అతి పండితుడు


అతి పండితుడు
వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.

'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.

ఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి "మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.

పండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు.


    నీతి: కుటిలత్వానికి తానేకాక తనవారు కూడా బలవుతారు.

Monday, 29 October 2012

పురాణాలు


పురాణాలు
"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.

పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. మన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ ప్రబంధాలన్నీ పురాణాలలోంచే ముడి సరుకుని తీసుకున్నాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామక్రుష్ణుడు తన పాండురంగ మహాత్యానికి స్కాంద పురాణమే ఆధారమన్నాడు. రాయల వారు అముక్తమాల్యదలోని కొన్ని కథలను విష్ణు పురాణం నుంచి తీసుకున్నాడు.

మానవ జీవితానికి కావలసిన శాస్త్ర విషయాలను పురాణాలలో మన ఆదిమ ఋషులు చేర్చేవారు. ఋషి ప్రోక్తాలు కాబట్టే పురాణాలను కూడా వేదాలలాగే ప్రమాణద్రుష్టితో చూసేవారు. నిజానికి మనకు వేదకాలంలో కూడా పురాణ సాహిత్యం ఉంది. అధర్వ వేదం పురాణాన్ని పేర్కొంది. ఉపనిషత్తులు కూడా పురాణ ప్రాముఖ్యాన్ని శ్లాఘించాయి. వేద కాలం నాటి పురాణ సమ్హితలో 4 వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి. అవి నేటికి పెరిగీ పెరిగీ కొన్ని లక్షల స్లోకాలుగా పరిణామం చెందాయి. 18 మహా పురాణాలలోని శ్లోకాలు 4,11,000 అని లెక్కతేలుతున్నాయి. ఉప పురాణాల శ్లోక సంఖ్య అంచనా కట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు.

సిద్ధాంతాల ఘాటునుబట్టి పురాణాలను సాత్విక, తామస, రాజస పురాణాలని 3 గుణాలవారీగా వర్గీకరించవచ్చు. పురాణంలోని ప్రతి ఒక్క కథకూ ఫలశ్రుతి చెప్పారు. ఫలానా ఫలం కావాలంటే ఫలానా నోము నోచమన్నారు. ప్రతి పురాణాన్నీ వ్యాసుడు వ్రాస్తే దాన్ని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహా మునులకు చెప్పాడు. అయితే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పంలో పుడుతుంది. కల్పమంటే బ్రహ్మ దినం. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మకల్పం అన్నమాట.

విశ్వము యొక్క సృష్టి స్ధితి లయములు, రాజవంశములు మున్నగు వాని చరిత్రములను పురాణములు వివరించును. మరియు భగవంతు డొనర్చు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణములను, మనుజులు పాటింపవలసిన ధర్మములను, ఆధ్యాత్మిక సాధనలను పురాణములు ప్రబోధించుచున్నవి. పవిత్ర క్షేత్రములు, తీర్ధస్ధలములు మున్నగువాని మహత్యములను గూడ పురాణములలో వర్ణింపబడినవి.

శబ్దప్రధానములైన వేదములు ఏ విషయములను ప్రభువువలె శాసించునో ఆ విషయములనే అర్ధ ప్రధానములైన పురాణములు మిత్రుని వలె కథలద్వారా మనకు తెలియపరచును. అందువలన హిందూ సాహిత్యములో పురాణములు మిక్కిలి ప్రధానములై యున్నవి.


అష్టాదశ పురాణాలు:-

దీనిలో 1400 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడినవి.

ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హొమము, శతచండీ, సహస్ర చండీ హొమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే.

దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి.

దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.

దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గూర్చి వివరించబడినవి.

దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.

దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడింది.

దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతార మెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు. పుణ్యక్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.

దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము - ఋతు వర్ణనలు వివరించబడినవి.

దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.

ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహత్మ్యము, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.

దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.

ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివస్తోత్రము) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.

దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు)చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహ్మొత్తర ఖండము (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహకాల మహత్మ్యము) మొదలగునవి కలవు.

ఇది శివుని ఉపదేశములు, లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతోపాటు వ్రతములు. ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.

ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహవిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ - నరక ప్రయాణములు తెలుపబడినది.

ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నరసింహావతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.

ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్ధసారం - పఠనమహత్మ్యం, గంగామహత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహత్మ్యం, పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలుయజేయబడింది.



శుక్రాచార్యుని జన్మవృత్తాంతం


శుసనుడనే ముని ఒకసారి కుబేరుని సంపదను దోచుకుపోతాడు. అప్పుడు కుబేరుడు లబోదిబోమని మొత్తుకుంటూ వెళ్ళి శివుని దగ్గర మొరపెట్టుకొన్నాడు అతడి మొరను ఆలకించిన శివుడు కుబేరునికి అభయహస్తమిచ్చి, శుశనుడి కోసం గాలిస్తాడు. విషయం అర్ధం చేసుకొన్న శుసనుడు సరాశరి ఈశ్వరుని శూలం మీదనే కూర్చున్నాడు. అది గమనించిన గరళకంఠుడు తన శూలాన్ని కిందకు వంచుతాడు. అలా వంగిన శూలమే 'పినాకి ' అయినది.

తర్వాత శివుడు శుసనుడ్ని మ్రింగేస్తాడు. అప్పుడు శుసనుడు తనను విడుదల చేయమని తెగ మొరపెట్టుకొన్నాడు. చివరకు శివుడు అతనిని శుక్లం వెలువడే రంధ్రంద్వారా విడిచిపెడతాడు. అలా శుక్లం ద్వారా వెలువడైన వాడే శుక్రాచార్యుడు. ఆ తరువాత అతడే రాక్షస గురువయ్యాడు.

తిరుపతి, తిరుమల



తిరుపతి, తిరుమల
శ్రీవేంకటేశ్వరస్వామి
ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం.

క్షేత్ర వైభవం
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రినీలాద్రిగరుడాద్రి,అంజనాద్రివృషభాద్రినారాయణాద్రివేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర .

సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి.విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామి వారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా, వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదో శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి "నీలాద్రి" గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ళతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

కృతయుగంలో... తిరుమలలోని తుంబురుతీర్ధం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢ భక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్దం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలం పాటు జరిగిన ఆ యుద్దంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాధ.

విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. "వేం" అంటే పాపాలు అని, "కట" అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని "వేంకటాద్రి" అంటారని ప్రతీతి.

బహ్మోత్సవ సంబరం చూతము రారండీ...
తిరుమలలో ప్రతి రోజూ పర్వదినమై అనేక ఉత్సవములు జరుగుతున్నా విశేష పరవడి ఉత్సవములుగా చైత్రమాసంలోను, భాద్రపదమాసంలోను స్వామివారికి విశేషంగా జరిగే బ్రహ్మొత్సవాలు ముఖ్యం. వైభవోపేతంగా జరుగుతాయి.

"కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ" పై వెలసిన వేంకటేశ్వరుడు సకల సింగారాలతో తిరువీధుల మెరసిపోయేందుకు సిద్దమవుతున్న బ్రహ్మ ఉత్సవాల శుభఘడియలివి ఆనంద నిలయంలో కొలువై ఉండి భక్తులను తన వద్దకు రప్పించుకునే దేవదేవుడు ఏడాదికొక్కసారి బహు వైభవంగా జరిగే ఊరేగింపు ఉత్సవాలలో పాల్గొని, భక్తులకు మరింత చేరువయ్యేందుకు ముస్తాబవుతున్న శుభవేళ ఇది... బ్రహ్మాండంలోని భక్తకోటి అంతా తరలి వచ్చి స్వామివారి శోభాయాత్రను కనులారా తిలకించి, మనసారా పులకించే తరుణమిది... సకల లోకాలలోని సర్వ దేవతా గణాల్ని సాదరంగా భువికి ఆహ్వానించి బ్రహ్మ ఉత్సవాల్ని జరుపుకోవటానికి తిరుమల యావత్తూ సంసిద్దమవుతున్న సమయంలో... ఇంతటి ప్రాశస్త్యం గల ఈ బ్రహ్మ ఉత్సవాలు ఎలా జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పటినుంచి ఆరంభమయ్యాయన్న విశేషాలను గుర్తు తెచ్చుకోవటం సందర్భోచితం. తిరుమలేశుని ఆలయంలో నిత్యకల్యాణం-పచ్చతోరణమే అయినా, బ్రహ్మ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మ ఉత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి "బ్రహ్మ ఉత్సవాలు" అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే - నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిదిరోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి "బ్రహ్మ ఉత్సవాలు". అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని "బ్రహ్మ ఉత్సవాలు" అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని "బ్రహ్మ ఉత్సవాలు" అంటున్నారని మరికొందరి భావన. బ్రహ్మ ఉత్సవాలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిని ఆయా సందర్బాలను బట్టి నిత్య బ్రహ్మ ఉత్సవం, శాంతి బ్రహ్మ ఉత్సవం, శ్రద్దా బ్రహ్మ ఉత్సవాలుగా పేర్కొంటారు. ప్రతి సంవత్సరం నిర్థారిత మాసంలో, నిర్థారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మఉత్సవాలు. ఇవి మూడురోజులుగానీ, అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి. ఇవి ప్రతి సంవత్సరం కన్యా మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విథంగా తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఇక కరువుకాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి "శాంతి బ్రహ్మ ఉత్సవాలు". ఇలాంటి శాంతి బ్రహ్మ ఉత్సవాలను గత చరిత్రకాలంలో చాలా మంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. ఇక మూడోది శ్రద్దా బ్రహ్మఉత్సవం. ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దేవస్థానంలో కాని, దైవసన్నిధిలో కాని సమర్పించి, భక్తిశ్రద్దలతో జరిపించుకొనేది "శ్రద్దా బ్రహ్మ ఉత్సవం". శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్దా బ్రహ్మ ఉత్సవాలను "అర్జిత బ్రహ్మ ఉత్సవాలు" గా పేర్కొంటున్నారు. శ్రీవారి బ్రహ్మ ఉత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండుగగా జరుగుతాయి. "నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి" అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మ ఉత్సవాలను కన్నులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

స్వామిని దర్శించేందుకు పలు మార్గాలు
శ్రీవారి దర్శనానికి 90గంటలు కొండమీద ఉండటానికి చోటు చాలక భక్తుల అగచాట్లు క్యూకాంప్లెక్స్‌లో తొక్కిసలాట వీఐపీ బ్రేక్ దర్శనాలపై భక్తుల ఆగ్రహం మహాలఘ దర్శనంపై అసంతృప్తి ఇవీ నిత్యం టీవీ ఛానెళ్ళలో, దినపత్రికల్లో చూసే తిరుమల విశేషాలు. ఎందుకిలా జరుగుతోంది? సరే! వీఐపీలకు తితిదే రాచమర్యాదల సంగతి పక్కన పెడితే మిగతా ఇబ్బందులను భక్తులు ముందస్తు ప్రణాళిక వేసుకోవడం ద్వారా తప్పించుకోవచ్చు. సెలవులు కలిసొచ్చాయి కదా అని ఎవరికి వారు పండుగ దినాల్లో, వారాంతపు రోజుల్లో తిరుమల ప్రయాణం పెట్టుకుంటారు. అలాంటి సమయాల్లోనే పైన చెప్పిన చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఇబ్బందులేవీ లేకుండా తిరుమల యాత్ర ప్రశాంతంగా జరగాలంటే భక్తులు అనుసరించాల్సిన పద్దతులివీ కోరిన వరాలిచ్చే కోనేటి రాయని మొక్కు తీర్చుకునేందుకు రోజూ తిరుమలకు వేల సంఖ్యలో భక్తులు వెళ్ళివస్తుంటారు. ఉత్సవ సమయాల్లో ఆ సంఖ్య లక్షకు పైగా చేరుతుంది. జాతీయ సెలవు దినాలు, శని, ఆది, మంగళవారాల్లో తిరుమలలో మామూలుగానే రద్దీ విపరీతంగా ఉంటుంది. ధనుర్మాసంలో, ఆణివార ఆస్థానం, ఉగాది లాంటి సమయాల్లో అన్ని సేవలూ రద్దు చేసి వాటిని ఏకాంతంలో జరుపుతారు. ఆయా సమయాల్లో శ్రీవారి సేవల్లో పాలుపంచుకునే అవకాశం భక్తులకు లభించదు. దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకూ ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళేటట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. అందులో ప్రధానమైనవి
  • శ్రీవారి దర్శనానికి, తిరుమలలో ఉండడానికి ఏర్పాట్లు.
  • ఆర్జిత సేవలు చేయించదలిస్తే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం.
  • ఎన్ని రోజులు ఉండేదీ అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా రానూ పోనూ ప్రయాణ టిక్కెట్లు రిజర్వు చేయించుకోవడం. ఈ ప్రణాళిక అమలులో భాగంగా మొట్టమొదట చేయాల్సిన పని మీ ఊళ్ళో / ఊరికి సమీపంలో తితిదే ఆన్‌లైన్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం.
ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా...
సాధారణంగా తితిదే కల్యాణమంటపాల్లో లేదా జిల్లా కేంద్రాల్లో ఈ ఆన్‌లైన్ కేంద్రాలు ఉంటాయి. అక్కడ అర్చనానంతరం దర్శనం (ఏఏడీ-రూ.200), దర్శనం (రూ.50), కాటేజీ (రూ.100) లకు రిజర్వేషన్ కోసమైతే ఒక్కరు వెళితే సరిపోతుంది. ఏఏడీ, దర్శనం టోకెన్లను బయోమెట్రిక్ పద్దతిలో (వేలిముద్రల ఆధారంగా) ఇస్తారు. కాబట్టి తిరుమలకు ఎంత మంది వెళ్ళాలనుకుంటే అందరూ ఆన్‌లైన్ కేంద్రానికి వెళ్ళి వేలిముద్రలు ఇవ్వాల్సిందే.

ఇంటర్‌నెట్...
విదేశాల్లో ఉన్న వారైతే ఇంటర్‌నెట్ ద్వారానే అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. ఆర్జిత సేవల టిక్కెట్లను www.ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. కాటేజీ వసతి (రూ.100, రూ.750) కూడా ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు. సిటీబ్యాంక్‌తో అనుసంధానమైన ఏ క్రెడిట్ కార్డు ద్వారానైనా చెల్లింపులు జరిపితే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో లావాదేవీలు పూర్తికాగానే... క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరిగినట్లు ఒక నివేదిక వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తిరుమల చేరుకున్నాక ఒకరోజు ముందుగా అక్కడి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఆ రసీదును చూపిస్తే అసలు టిక్కెట్టు జారీ చేస్తారు. గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్ / పాస్‌పోర్ట్ / ఓటరు గుర్తింపు కార్డు / పాన్‌కార్డు వీటిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. పద్మావతి గెస్ట్‌హౌస్ విచారణ కౌంటర్ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఒకరోజు ముందు వెళ్ళడం కుదరని పక్షంలో ఆర్జిత సేవ జరిగే సమయానికి ముందు వెళ్ళినా టిక్కెట్లు జారీ చేస్తారు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా... www.tirumala.org వెబ్‌సైట్‌లో తిరుమల విశిష్టత, శ్రీవారి సేవలకు సంబంధించి చాలా వివరాలు లభ్యమవుతాయి. ఈ బుకింగ్ సదుపాయాన్ని ఇక్కడి భక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ బుకింగ్ కోటా చాలా తక్కువగా ఉంటుంది. అందునా ఇంటర్‌నెట్ విప్లవం వచ్చాక ఇప్పుడందరూ నెట్ ద్వారానే టిక్కెట్లు బుకింగ్ చేస్తున్నారు. దాంతో మూడు నెలలు ముందుగానే దాదాపు అన్ని సేవలకూ, వసతికీ రిజర్వేషన్లు అయిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రయత్నించే వారికి చాలావరకూ నిరాశ తప్పదు. కానీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు.

అడ్వాన్స్ బుకింగ్
ఆన్‌లైన్ కేంద్రాలు, ఇంటర్‌నెట్ ద్వారా ఆర్జిత సేవలు, వసతి, దర్శన టిక్కెట్లు పొందలేని వారు అడ్వాన్స్ బుకింగ్ పద్దతిలో టిక్కెట్లు పొందవచ్చు. తిరుమలలోని ఆర్జితం ఆఫీసుకు ఫోన్ చేస్తే (0877-2263277, 2263679) ఏయే తేదీల్లో సేవా టిక్కెట్ల లభ్యత ఉందో తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగా తితిదే ఈవో పేరిట డీడీ తీసి పంపితే సరిపోతుంది. ఉదాహరణకు... కల్యాణోత్సవ సేవలో పాల్గొందామనుకునే భక్తులు తమకు ఫలానా రోజున అవకాశం కల్పించాలని కోరుతూ "కార్యనిర్వాహణాధికారి, తితిదే, తిరుపతి" పేరిట రూ.1000 డిమాండ్ డ్రాప్ట్ తీసి మూడు నెలలు ముందుగా "పేష్కార్, తిరుమల దేవస్థానం, తితిదే, తిరుమల-517504" చిరునామాకు పంపించాలి. కవరుపై భక్తులు తమ చిరునామాతో పాటు, టెలిఫోన్ నెంబరు కూడా రాయాలి. అత్యవసర సమయాల్లో దేవస్థానం వారు ఫోన్ ద్వారా కూడా సంప్రదిస్తారు. భక్తులు అడిగిన రోజున సేవా టిక్కెట్ల లభ్యత ఉండకపోతే తితిదే చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మరో నాలుగు తేదీలను కూడా సూచించాలి. అలా చేసినట్లైతే భక్తులు సూచించిన నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజుకి సేవా టిక్కెట్ల లభ్యత ఉంటుంది. ఆ తేదీని ఖరారు చేస్తూ కార్యనిర్వహణాధికారి కార్యాలయం నుంచి 15 రోజుల లోపలే సేవా టిక్కెట్టు వస్తుంది. భక్తులు సూచించిన నాలుగు తేదీల్లోనూ సేవా టిక్కెట్ల లభ్యత లేకపోతే డీడీని తిరిగి పంపించేస్తారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అర్చన, తోమాలసేవ ఏకాంతంలో జరుగుతాయి. ఈ రెండు సేవలకూ డీడీలు పంపేటప్పుడు భక్తులు తాము సూచించే తేదీలు ఆయా రోజుల్లో రాకుండా జాగ్రత్త పడాలి.

అప్పటికప్పుడే ఆర్జిత సేవా టిక్కెట్లు
ఇంటర్‌నెట్, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లు పొందలేకపోయినవారు అప్పటికప్పుడు ఆ టిక్కెట్లను పొందే మార్గమే కరెంట్ బుకింగ్. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విజయా బ్యాంక్ కౌంటర్‌లో తర్వాత రోజు జరిగే ఆర్జిత సేవలకు గాను టిక్కెట్లు విక్రయిస్తారు. వీలైనంత ముందే కరెంట్ బుకింగ్ వరుసలో ఉండడం మంచిది. దర్శనం, ఆర్జితం, వసతి టిక్కెట్లను ఏ పద్దతిలో తీసుకున్నా వాటిని రద్దు చేసుకునే వీలుండదు. అవకాశాన్ని బట్టి ఆ తేదీలను ముందు వెనుకలకు జరుపుకోవడం తప్ప, ఇక కరెంట్ బుకింగ్‌లో తీసుకున్న టిక్కెట్లనైతే వాయిదా వేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు.

వీఐపీ కోటాలో...
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు ఇచ్చిన సిఫారసు లేఖల ద్వారా అన్ని రకాల ఆర్జిత సేవా టిక్కెట్లను పొందవచ్చు. అర్చన, తోమాలసేవ, కళ్యాణోత్సవం, అభిషేకం వంటి సేవల టిక్కెట్ల కోసం సిఫారసు ఉత్తరాలతో ఒక రోజు ముందుగా తిరుమలలోని ప్రత్యేక అధికారిని సంప్రదించాలి. అర్చనానంతర దర్శనం, నిజపాద దర్శనం వంటి సేవలకు గాను విజయాబ్యాంక్ రెండో అంతస్తులో ఉన్న ఆలయ డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలి. ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఈవోల అనుమతి లభించాక ఆ రసీదులు తీసుకుని విజయా బ్యాంక్‌కు సమర్పించి నగదు చెల్లిస్తే సేవా టిక్కెట్లను మంజూరు చేస్తారు.

ప్రయాణం... దర్శనం... శీఘ్రం
దర్శనానికీ, వసతికీ, సేవాటిక్కెట్లకీ రిజర్వేషన్ అయ్యాక చెయ్యాల్సింది ప్రయాణం టిక్కెట్ల రిజర్వేషన్. భక్తులు ఉండే ప్రదేశం, వారి ఆర్థిక స్థోమతను బట్టి ప్రయాణ సాధనాలను ఎంచుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన సౌకర్యం ఉంది. తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు విమానాలు వచ్చే వేళకు అక్కడ తితిదే బస్సులు సిద్దంగా ఉంటాయి.రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు,నగరాల నుంచి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

రైల్లో వెళితే...
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతుంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండ మీదకు వెళ్ళిపోవచ్చు.

బస్సులో వెళితే...
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్ స్టేషన్. రైలు వచ్చే సమయానికి అక్కణ్ణుంచి తిరుమలకు వెళ్ళే బస్సులు బయలుదేరేందుకు సిద్దంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టాండ్‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టాండ్ (పెద్ద బస్‌స్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ పద్మావతి బస్‌స్టాండ్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

నడక దారిలో...
కొండమీదకు నడిచి వెళ్ళే వారికి సామాను మోయాలనే చింతే అక్కర్లేదిప్పుడు. అలిపిరి టోల్‌గేటు వద్ద ఉన్న కౌంటర్లో సామాను ఉంచి, టోకెన్ తీసుకుంటే వారు కొండ ఎక్కేసరికి వారికన్నా ముందే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస (సీ ఆర్ వో) కు సామాన్లు చేరిపోతాయి. తిరుపతిలో తితిదే నిర్వహిస్తున్న సత్రాల్లో ఎక్కడైనా సామాన్లు ఉంచి, టోకెన్ తీసుకుంటే చాలు వాటిని తిరుమలకు చేరవేస్తారు. ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. నడిచి వెళ్ళే భక్తుల కోసం తితిదే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరి వరకు ప్రతి అరగంటకు రెండు ఉచిత బస్సులు నడుపుతుంది. వారి సౌకర్యార్థం తాగు నీరు, మరుగు దొడ్లు, విశ్రాంతి కోసం షెల్టర్లు, వైద్య సౌకర్యాలు... ఇలా ఎన్నో ఏర్పాట్లు చేసింది. బీపీ, హార్ట్ ఎటాక్ పేషెంట్లు, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు నడిచి వెళ్ళే కన్నా బస్సులోనే వెళ్ళడం మంచిది.

బండి మీద వెళ్ళితే...
కొంత మంది తమ సొంత వాహనాల్లోనే తిరుమలకు బయలుదేరతారు. దురదృష్టవశాత్తూ ఆ బళ్ళు ఘాట్ రోడ్ మార్గంలో ఆగిపోతే? భయపడక్కర్లేదు. అలాంటి వాహనాలను బాగుచేసేందుకు తితిదే ఆటోమొబైల్ క్లినిక్ నడుపుతోంది. వాహనం బ్రేక్‌డౌన్ అయిన సంగతి, ఏ ప్రాంతంలో ఉన్నదీ అలిపిరి టోల్‌గేట్ వద్ద ఉన్న సిబ్బందికి సమాచారమిస్తే తితిదే నియమించిన మెకానిక్‌లు మొబైల్ వ్యాను, స్పేర్‌పార్ట్స్ తో సహా అక్కడికి చేరుకుని ఆగిపోయిన వాహనాన్ని బాగు చేస్తారు. సర్వీసును బట్టి రుసుము, కొత్త పరికరాలు అమర్చితే వాటి విలువ చెల్లించాల్సి ఉంటుంది.

వసతికి కీలకం సీ ఆర్ వో
తిరుమలలో బస్సు దిగాక మొట్టమొదట చేయాల్సిన పని సీ ఆర్ వో కు వెళ్ళడం. సీ ఆర్ వో అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ వెబ్‌సైట్ల ద్వారాను వసతి రిజర్వేషన్ చేయించుకున్న వారు ఆ కార్యాలయానికి వెళ్ళి... తాము సొమ్ము చెల్లించిన రసీదును చూపిస్తే లభ్యతను బట్టి గదులు కేటాయిస్తారు. ఉచిత వసతి సౌకర్యం కావాలన్నా సీ ఆర్ వో లోనే సంప్రదించాలి. తిరుమలలో ఉచితంగా వసతి కల్పించే సత్రాలు మూడు ఉన్నాయి. సీ ఆర్ వో పక్కనే మూడు ఉచిత వసతి భవన సముదాయాలు (పిలిగ్రిం ఎమినిటీస్ కాంప్లెక్స్-పీ ఏ సీ) ఉన్నాయి. ఈ కాంప్లెక్స్‌లో బస చేసిన యాత్రికులు విలువైన వస్తువులు ఉంచుకునేందుకు ఉచిత లాకర్ల సౌకర్యం కూడా ఉంది. ఈ భవన సముదాయాల్లో బస చేయాలంటే ముందుగా రూ.200 డిపాజిట్ చేయాలి. ఖాళీ చేసేటప్పుడు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. తలనీలాలు ఇచ్చేందుకు పీ ఏ సీ ల్లో మినీ కళ్యాణ కట్ట ఉంది. అదీ ఉచితమే. సీ ఆర్ వో లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. తిరుపతి నుంచి బయలు దేరే ఏ రైలుకైనా 24 గంటల ముందు వరకూ కూడ అక్కడ రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే దర్శనం సులభంగా అవుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వెళ్ళి నానా అగచాట్లు పడే బదులు చక్కటి ప్లానింగ్‌తో వెళ్ళి స్వామి వారిని ప్రశాంత చిత్తంతో దర్శించండి.

తిరుమలలోనే ఒక వైపున పాపనాశనం జలపాతం, మరోవైపున గోగర్భం నీటి యూట మొదలయినవి మరియు ఆంజనేయస్వామి తల్లియైన అంజనా దేవి పుత్రార్ధియై తపమాచరించిన చోటు - తిరుమలలో శ్రీ వేంకటేశుని దర్శించబోయే ముందు ముఖ్యంగా చూడవలసిన వరాహ నరసింహ స్వామి దేవాలయము, పవిత్ర పుష్కరిణీ స్నానం చేసి స్వామి దర్శనానికి భక్తులు తేలికగా వరుసగా వెళ్ళటానికి ఏర్పరచిన క్యూలలో ప్రవేశించి దర్శనోత్సాహులై ఎన్ని గంటలయినా నిరీక్షించి క్యూలల్లో కదిలి వెళ్ళి స్వామిని దర్శించి పునీతులవుతారు.

తిరుమలపై నూతనంగా అభివృద్ధి పరచబడిన ఎన్నో ఉద్యానవనాలున్నాయి. తిరుమలకొండపై ఎక్కడ వున్నా భగవన్నామ స్మరణ నిత్యం జరుగుతూ మన చెవులకు శ్రావ్యంగా వినపడటానికి స్పీకర్లు అన్ని చోట్లా అమర్చారు. అక్కడ వున్నంత సేపు తనువూ, మనసూ మైమరచి భక్తిభావంతో పులకించిపోతారు భక్తులు ఆ దివ్యానుభూతిని కలకాలం మనసులో దాచుకుని మరచిపోలేరు కూడా.

ఆధ్యాత్మిక తత్వానికి తోడుగా ప్రకృతి రమణీయమై, నేత్రపర్వంగా మనోహర దృశ్యాలు దృగ్గోచర మవుతాయి.

తిరుమల నుండి క్రిందికి దిగితే తిరుపతి పట్టణం చూడముచ్చటగా సాక్షాత్కారమవుతుంది. ఒక వంక విజ్ఞానభాండారమైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ భవనాలు, పద్మావతీ కళాశాల - అనేక శాఖోపశాఖలుగా విలసిల్లిన కళాశాల భవనాలు ఒక వంక, మరో ప్రక్క కపిల తీర్థమనే ఎత్తునుండి నీరు ధారగా పడే జలపాతం కమనీయంగా కనబడతాయి. తిరుపతి నుండి పట్టణాన్ని ఆనుకునే తిరుచానూరు, అలివేలు మంగాపురం. పద్మావతి అమ్మవారి దేవాలయం, కళ్యాణ మండపం, శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం, గోవిందరాజుల స్వామి వారి ఆలయం మొదలైన దేవాలయాలు ఎంతో చూడదగినవి.

ఆలూరుకోన శ్రీరంగనాధస్వామి


ఆలూరుకోన శ్రీరంగనాధస్వామి
భూలోకం సుభిక్షంగా ఉండడం కోసం, ప్రజలు ఆనందంగా జీవించడం కోసం, యాగాలనాచరించడమే కర్తవ్యంగా భావించి నిరంతరం భగవంతుడికీ ప్రజలకూ సేవలు చేసే సంకల్పమున్న మహర్షులు ఎందరో ఉన్నారు. వారి కోవకు చెందిన వారే విశ్వామిత్ర మహర్షి, ఒకసారి ఒక దట్టమైన వనంలో యాగం చేయడానికి సంకల్పించారు.

ప్రజలు సంతోషంగా జీవించడం నచ్చని తాటకి అనే రాక్షసి తన తమ్ముడైన మారీచుడిని మరియు మరి కొందరు రాక్షసులను పిలిచి యాగాలను ఛిన్నా భిన్నం చెయమని ఆజ్ఞాపించింది. మారీచుడు తదితరులు మహర్షులు లోక సమ్రక్షణార్ధం చేసే యాగాలను ప్రతీసారి ధ్వంసం చేసి మునులను ఇక్కట్లుపాలు చేసేవారు.

ఎన్ని మార్లు యాగాన్ని మొదలు పెట్టినా ఏదో ఒక అవాంతరం వాటిల్లి యాగాన్ని ముగించలేక పోయారు మహర్షులు. ఈ అన్యాయాలకు తాటకి మూలకారకురాలని తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు తెలుసుకున్నారు. వెంటనే అయోధ్యకు వెళ్ళి దశరధమహారాజుని కలుసుకుని తాటకి చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి బాలురైన రామలక్ష్మణులను పంపి, లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు.

బాలురైన రామలక్ష్మణులను రాక్షసిని సణారం చేయడానికి పంపడానికి సంకోచించాడు దశరధమహారాజు. రాజ వంశ కులగురువైన వశిష్టుడు ధైర్యం చెప్పగా బాలురను విశ్వామిత్రుని వెంట అడవులకు పంపాడు దశరధమహారాజు.

రామలక్ష్మణులు తమ ధనస్సు తీసుకుని విశ్వామిత్రుడి వెంట యాగశాల వున్న దట్టమైన అడవికి బయల్దేరారు. విశ్వామిత్రుడు మరో మారు యాగాన్ని ప్రారంభించాడు. తాటకి తన అనుచర రాక్షసులతో అక్కడికి వచ్చింది.

అసుర సంహారం కోసం వచ్చిన రాముడు యాగాన్ని ఆపడానికి వచ్చింది ఒక శ్త్రీ అని తెలుసుకుని వెనుకంజవేయగా, విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసి పై విల్లు ఎకుపెట్టమని ఆజ్ఞాపించాడు. మహర్షి మాట కాదనలేక బాణము గురిపెట్టాడు రాముడు.

రాముని బాణం భారీకాయురాలైన తాటకికి తగిలి నేలకొరిగింది. వైకుంఠనాధుని చేత మరణం వాటిల్లినందువల్ల మోక్షం పొందింది తాటకి. తాటకి సణారం గురించి తెలుసుకున్న మిగిలిన అసురులు పరుగు లంఘించారు. యాగం మొదలైంది. నిరాటకంగా సాగింది.

అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించి, ఆమె ప్రాణాలు వదిలిన స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు.

పెన్నానది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాధుడు స్వయంభువ లింగరూపంలో దర్శనమివ్వడంతో పరమానందభరితుడయ్యాడు. పరుశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు.

ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు.

తాటకికి మోక్షం శ్రీరాముడి పరిణయం ఈ దృశ్యాలన్నిటిని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో ఏనాడో తెలుసుకున్న విషయాలు. తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు. ఆలయము నిర్మించబడింది.

క్రీ.పూ. 1460 సంవత్సరంలో మొదలైన ఆలయనిర్మాణం క్రీ.పూ 1475 సంవత్సరంలో ముగిసింది. బుక్కా రామలింగస్వామి ఆలయం పేరున పిలువబడుతుంది. ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం చూడగలం.

విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో వున్న కొండ చరియపై నెలకొన్న ఆలూరుకోన అని అంటారు. పురాణకధ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు.

ఆ ఆలయంలో తాటకికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.కొండపై చిన్న ఆలయ ద్వారం దాకా మనం వాహనాల్లో వెళ్ళగలిగేంత సౌకర్యంగా ఉన్నాయి రహదారులు.

తాడిపత్రి నుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆల్లొరు కోన దట్టమైన అడవిలో పక్షులు కలకలరవాలు మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు.

ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మంద్రంగా వినిపిస్తాయి. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్తే ఒక మండపం ఆ తర్వాత ఆలయగోపుర ద్వారం గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార చివర బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ ్భగవాన్‌ సన్నిధి. గరుడ భగవాన్‌ శ్రీరంఘనాధుని సేవలoోనిరంతరం తన్మయత్వంతో ఉన్నట్టు దర్శనమిచ్చే విగ్రహం.

గరుడ భగవాన్‌ ఎదుట ఒక మండపం ఆ తర్వాత గర్భగుడి. భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రీరంగనాధుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకొని తూర్పువైపుకి కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవళించిన విగ్రహం పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చున్నట్టున్న విగ్రహాలు దర్శనమిస్తాయి. నాభియందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.

మాములుగా శేషశయనంపై పవళించే శ్రీరంగనాధుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కాని ఈ క్షేత్రంలో వున్న శయనించిన శ్రీరంగనాధుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీరామానుజల వారికి గర్భగుడి నిర్మించారు.

బయటి ప్రాకారంలో వరుసగా శంఖుచక్రాలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది.

రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం. ఇంటి దైవముగా బాసిల్లుతున్నాడు. తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు.

ఆలయంలో వాయువ్య మూలలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు.

పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీరంగనాధుని దర్శించి స్వామి వారి అనుగ్రహం పొందుతాం.

Sunday, 28 October 2012

ఆత్మవిశ్వాసము


ఆత్మవిశ్వాసము
కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.

సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం" అని వెండి నాణెము తీసి చూపించి "నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.

నేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు.

మూలం: పిల్లల నీతి కధలు, నండూరి భాగ్యలక్ష్మి, సరస్వతి పబ్లికేషన్స్.

అభిమాని


అభిమాని
అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.

పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.

అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.

ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.

సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.

మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.

"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.

ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.

మూలం: బాలమిత్ర.


రాజా రామమోహనరాయ్

రాజా రామమోహనరాయ్
రాజా రామమోహనరాయ్
పేరు:రాజా రామమోహనరాయ్.
తండ్రి పేరు:రమాకాంత్ రాయ్
తల్లి పేరు:శ్రీమతి ఠాకూరాణి.
పుట్టిన తేది:22-5-1772.
పుట్టిన ప్రదేశం:బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం:పాట్నా.
గొప్పదనం:విగ్రహారాధన, స్త్రీ విద్య పై ఆంక్షలు, సతీసహగమనం మొదలగు దురాచారాల గురించి పోరాడాడు.
వ్రాసిన రచనలు:'హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ'.
స్వర్గస్తుడైన తేది:క్రీ.శ. 1833 వ సంవత్సరం.

రాజారామమోహన్ రాయ్ 1772 మే 22 న బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు. తండ్రి రమాకాంత్ రాయ్ ముర్షీదా బాద్ పాలకులైన మహమ్మదీయుల ఆస్థానంలో పనిచేసేవాడు. తల్లి ఠాకూరాణి సనాతనురాలు. రామమోహనరాయ్ ప్రాధమిక విద్యను ఆ గ్రామంలోనే అభ్యసించాడు. తరువాత పాట్నాకు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. చిన్నతనం నుంచే అతను ఖురాన్, బైబిలు, భగవద్గీత క్షుణ్ణంగా చదివాడు. అంతేకాదు ఆయా గ్రంధాల లోతుపాతుల్ని గ్రహించాలనే జిజ్ఞాసతో, అరబ్బీ భాషను, సంస్కృత భాషను, ఇంగ్లీషును అభ్యసించి, ఆయా మతాలకు సంబంధించిన ఇతర గ్రంధాలను అధ్యయనం చేశాడు. ఒకప్పుడు భారతదేశంలోని స్థితిగతులను చూసిన వారెవ్వరూ ఇంతటి మార్పు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరేమో?

ఆ రోజుల్లో సాంఘీక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. చాందస సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, అవివేకంతో కూడిన ఆచారాలు, నిరక్షరాస్యత దేశ జీవన వాహినికి అడ్డుగోడలై అంధకారమయిపోయింది. దానికితోడు బ్రిటీష్ దొరల పెత్తనం, మన దేశ ప్రజలను సాంఘీకంగా, రాజకీయంగా పెరగనివ్వకుండా, మూఢ నమ్మకాల వలయంలో కూరుకుపోవడానికీ అవకాశం కలిగించి, ప్రజలను మరింత చీకట్లోకి పడవేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అటువంటి సమయంలో వెలుగు రేఖలా అవతరించాడు "మహా మనిషి" రాజా రామమోహన రాయ్. "ప్రముఖ సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, యుగకర్త" గా కొనియాడబడిన మహా వ్యక్తి. మన ఆచారాల విషయంలో గుడ్డి నమ్మకాలు, జుగుప్స కలిగించే విశ్వాసాలు, అజ్ఞానంతో కూడిన ఆచారాలు, పాప విముక్తి కొరకు ఆచరించే అనేక ప్రక్రియలు రాం మోహన్ రాయ్ కి ఎంతో చికాకు కలిగించాయి.

ఒక మతానికి చెందినవారు ఇతర మతాలకు చెందిన వారిపై నిందారోపణలు చేయటం, బహిరంగంగా విమర్శించుకోవటం, ముష్టి యుద్ధాలకు దిగటం ఆయన సహించలేకపోయాడు. ఆయన ఉద్దేశంలో "దేవుడనే వాడు ఒకడే. ఏ మతమైనా, కులమైనా అందరూ ఆరాధించేది ఒకరినే. అందరి పూజలూ ఆయనకే చేరుతాయి. మతాలన్నీ కలసి పోయి విశ్వమతం ఏర్పడాలి "ఆ ఆలోచనలే ఆయన బ్రహ్మ సమాజం స్థాపించడానికి పురికొల్పాయి. రాయ్ హిందువు అయినప్పటికీ, హిందూ మతంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించేవాడు. ఆ సమయంలోనే వాటిని ఖండిస్తూ ఒక వ్యాసం రాసినప్పుడు తండ్రికి కోపం వచ్చి, అతనిని ఇంటి నుండి గెంటివేశాడు. అయినా, రాయ్ చలించక, తన దేశ ప్రజలు బాగుపడాలంటే మూఢ విశ్వాసాలను వదిలి, బాగా చదువుకొని జ్ఞానం సంపాదించి తెల్లదొరల బానిసత్వపు చెరను తప్పించుకొని, స్వతంత్రంగా బతకాలని భావించి తన భావి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ రోజుల్లో భారతదేశంలో మతం పేరిట పీడిస్తున్న దురాచారాలలో "సతీసహగమనం" ముఖ్యమైనది.

భర్త మరణించగానే అతని శరీరం దహనం చేసేటప్పుడు భార్య కూడా ఆ మంటల్లోకి దూకి దహనమయ్యే అనాగరిక చర్యను అప్పటి ప్రజలు ఎంతో పవిత్ర కార్యక్రమంగా భావిస్తూండేవారు. రాయ్ ఆ చర్యను ఖండించినప్పుడు ఎందరో పెద్దల ఆగ్రహానికి, అసంతృప్తికి గురి అయ్యాడు. అయినా పట్టువిడువక, బ్రిటీష్ దొరలతో పోరాడి "సతి"ని నిషేధించమని హవుస్ ఆఫ్ కామన్స్ కి ఒక విజ్ఞాపనపత్రం సమర్పించాడు. అయితే అప్పటి ప్రభుత్వం ఆ విజ్ఞాపనను తిరస్కరించింది. రాయ్ విజ్ఞాపనను అంగీకరిస్తే అతను ఇంకా అనేక సంఘ సంస్కరణలు తలపెట్టి ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాడేమోననే భయం వారిలో ఎక్కువగా ఉండేది. భారతీయులు సాంఘీకంగా గానీ, రాజకీయంగా గానీ విజ్ఞానపరంగా గానీ చైతన్యవంతులుకావటం వారి కిష్టంలేదు. హిందూ స్త్రీలకు "సతి" దురాచారం ద్వారా అన్యాయం జరుగకుండా కాపాడటమే కాకుండా, స్త్రీలకు వారి తండ్రి, భర్తల ఆస్తిలో హక్కు ఉండాలని కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ మోహన రాయే. 1823లో "హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ" అనే గ్రంధం కూడా రాసి సంచలనం సృష్టించాడు.

రాయ్ సంఘ సంస్కర్తగా తన విధి నిర్వహణలో అష్టావధానం చేశాడు. విద్య, సంగీతం, సాహిత్యం, రాజకీయం, విశ్వమత ప్రచారం, ప్రజల ప్రతినిధిగా, మూఢ విశ్వాసాలను ఖండించే వ్యక్తిగా అనేక రంగాలలో కృషి చేశాడు. రాయ్ బెంగాలీ బాషలో "బెంగాలీ భాషా వ్యాకరణం" రాశాడు. దాన్ని 1833లో కలకత్తాలో ప్రచురించారు. అనంతరం పాఠశాలలో పాఠ్యయగ్రంథంగా ప్రవేశపెట్టడం జరిగింది. మతానికి సంబంధించిన అనేక గీతాలు రాశాడు. ఆ రోజుల్లోనే పత్రికా రంగానికి ఎంతో చేయూతనిచ్చిన ఘనత కూడా రాయ్ కే దక్కింది. కలకత్తాలో ప్రారంభమయిన తొలి పత్రిక "బెంగాల్ గెజెట్"ను 1916 నుండి 1920 దాకా రాయ్ శిష్యులే నిర్వహించారు. కాలక్రమాన రాయ్ సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని పరిశీలించిన ఢిల్లీ పాలకులు తమ తరపున, బ్రిటీష్ ప్రభుత్వంతో పనిచేయమని కోరారు.

ఢిల్లీ చక్రవర్తి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అనేకపర్యాయాలు ఇంగ్లాండువెళ్ళి రాజుకి, బ్రిటీషు ప్రభుత్వానికి ఉన్న విభేదాలను తొలగించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవకు, విజ్ఞానానికి, తెలివితేటలకు, సమయస్ఫూర్తికి , స్వామి భక్తికి బ్రిటీషు వారు కూడా విస్తుపోయారు. ఢిల్లీ చక్రవర్తి ఆయన సేవలకు మెచ్చి "రాజా" అనే బిరుదు నిచ్చాడు. అప్పటి నుండి ఆయన రాజా రామమోహన్ రాయ్ అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనను, ఆయన భావాలను అర్ధం చేసుకున్నవారు చాలా తక్కువ. చాలామంది ప్రజలు ఆయనను కఠినంగా తిరస్కరించారు. రాజా రామమోహన్ రాయ్ ఆశయసిద్ది కొరకు చివరి వరకు పోరాడారు.

1833 సెప్టెంబర్ 27న రాయ్ స్వర్గస్థుడయ్యాడు.రాజారామమోహన్ రాయ్ జీవించి వుండగా తన ఆశయాలను ఆచరణ రూపంలో చూడలేకపోయినా ఆయన తదనంతరం ప్రజలే వాటిలోని సత్యాన్ని గ్రహించి ఆయనను"యుగకర్తగా" కీర్తించి, ఆయన అడుగు జాడలలో నడుచుకుంటున్నారు.

మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్.

అరిస్టాటిల్

అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్తప్లేటో కి శిష్యుడు మరియు అలెగ్జాండర్ కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.[1]. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.

విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం

ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడని ప్రతీతి. విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవుపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంధాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు. అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు.


విజ్ఞానార్జన, విద్యాబోధన

అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో ప్లేటో అకాడమీ లో చేరి ప్లేటో కు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ప్లేటో చనిపోయిన తరువాత అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన మాసిడోనియాకు చేరాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ ఏథెన్స్ చేరుకుని ప్లేటో అకాడమీ కి పోటీగా లైజియం అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.

ఆరిస్టాటిల్ భావవాదం

ఆరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని నమ్మేవాడు. ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు.

మరణం

అలెగ్జాండర్ మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయాడు. అక్కడ ఒక ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీ.పూ. 322లో కాలధర్మం చెందాడు.

అలెగ్జాండర్


అలెగ్జాండర్


  


అలెగ్జాండర్ (గ్రీకు Αλέξανδρος ο Μέγας, మెగాస్ అలెగ్జాండ్రోస్జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323) గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు.

భారతదేశంపై దాడి

                      
                                                         క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం


క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు. ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు. [1]



అనేక కథనాలు

అలెగ్జాండర్ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి, చరిత్రకారుడైన కాలిస్థెనిస్ తన రచన సిలీషియా లో ఒక సముద్రం గురించి మరియు అలెగ్జాండర్ గురించి వ్రాసాడు. (Plutarch, Alexander' 46.2)



బైబిలులో ప్రస్తావన

డేనియల్ 8:5–8 మరీయు 21–22 లలో ఒక రాజు గురించి ప్రస్తావింపబడినది. ఈ రాజు మిడిస్ మరియు పర్షియాలను జయిస్తాడని, తరువాత అతడి సామ్రాజ్యం నాలుగు భాగాలుగా విభజింపబడుతుందని వ్యాఖ్యానింపబడినది. ప్రస్తావింపబడిన రాజు అలెగ్జాండరేనని కొందరు భావిస్తున్నారు.[ఆధారం కోరబడినది]

ఖురాన్ లో ప్రస్తావన


ప్రధాన వ్యాసం: ఖురాన్ లో అలెగ్జాండర్
ఖురాన్ లో ఒక సత్ప్రవర్తన గల పాలకుడి దుల్-ఖర్నైన్ లేదా జుల్-ఖర్నైన్ గురించి ప్రస్తావింపబడినది. అరబ్ మరియు పర్షియన్ ప్రపంచంలో ఈ దుల్-ఖర్నైన్, అలెగ్జాండరేనని భావిస్తున్నారు. కానీ కొందరు ధార్మిక చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో విభేదించి, దుల్-ఖర్నైన్ రాజు పర్షియాకు చెందిన సైరస్ రాజు అని భావిస్తున్నారు.


"షాహ్ నామా" లో

ఫిరదౌసి రచించిన ప్రబంధకావ్యం, షాహ్‌నామా పర్షియన్ భాషా సాహిత్యం లోని ప్రాచీన గ్రంథాలలో ఒకటి.