Saturday, 22 December 2012

కృష్ణ లీలలు

















హే… కృష్ణా!

క.       కన్నాయని పిలువ జనని
          దన్నుగ నిలచిన బుడతలు దౌడులు తీయన్
          ఉన్నపళము దబ్బునపడ
          వెన్నను పొర్లాడు కృష్ణు ప్రియమున కొలుతున్
తాత్పర్యము:  మిత్రుల భుజములమీదనెక్కిఉట్టి కట్టిన వెన్నకుండను తీయబోతున్న తరుణంలో,  కన్నా.. యను యశోద పిలుపు వినగానే మిత్రులందరూ భయంతో ఒక్కసారిగా పరుగులెత్తగావెన్నకుండతోపాటు దబ్బున పడిపోయి, నేలనొలికిపోయిన వెన్న మొత్తం ఒంటికి అంటుకుపోయిన కృష్ణ పరమాత్మను అత్యంత ప్రేమతో కొలుతును.

పంజాబీ జీవన చిత్రాలు


















ఫోటోగ్రాఫీ

మహాత్మా  గాంధీ




















విష్ణువు నాభిలో నుంచే బ్రహ్మ ఎందుకు పు ట్టాడు ?


 

 విష్ణువు నాభిలో నుంచే బ్రహ్మ ఎందుకు పుట్టాడు ?


















ఎవరైనా ఏదైనా ఒక కొత్త పనిని చేయాలనే సంకల్పంతో ఆ పనిని పూర్తిచేసినట్లయితే దానికి సృష్టికర్త అతడే అవుతాడు. ఏ ఒక్కరి సంకల్పమో కాకుండా సమిష్టి సంకల్పమైతే దానిని ‘ భగవంతుని సృష్టి సంకల్పం’’ అంటారు. సృష్టి సంకల్పం అనేదానికి బ్రహ్మ అని అర్ధం ముంది. అలాగే ఈ సమస్త లోకాలలో దేనికైనా ముఖ్యమైనదీ, కేంద్రమైనదీ, మూలమైనదీ ఈ సంకల్పమే కదా ! కనుక భగవంతుడైన విష్ణుమూర్తి యెక్క కేంద్రమైనటువంటి నాభి (బొడ్డులో)లో నుంచి బ్రహ్మ (సృష్టిసంకల్పం) పుట్టినట్లుగా మను పురాణాలు శాస్తాలు చెబుతున్నాయి.

నిద్రాభంగం ఎంతటి పాపం...!
నిద్రాభంగం ఎంతటి పాపం...!
మహాయుద్దం ముగిసిన తర్వాత వింటి మీద తల ఆన్చి నిద్రిస్తున్న శ్రీమహావిష్ణువును ఎలా నిద్రలేపాలో తెలియలేదు. లేపితే కలిగే నిద్రభంగపాపము, లేపకపోతే దేవతలకి అరిష్టం. అయినా శ్రీ మహాలక్ష్మీదేవి ఎంత నష్టం జరిగినా పరవాలేదనుకుంది. శ్రీ మహావిష్ణువును నిద్రలేపి ఆ దోషాన్ని మాత్రం పొందకూడదనుకుంది. ఈ పాపానికి దేవతలే భయం చెందుతారు. నిద్రాభంగముతోపాటు కథాభంగము, దాంపత్య భంగము, తల్లీ బిడ్డను విడదీయటం వంటివి కూడా మహాపాతకాలు, పాపమంటే పుణ్యం ద్వారా పోగొట్టుకోవచ్చు. పాతకమంటే అనుభవించాల్సిందే. వేరే దారి లేదు.