Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts
Saturday, 22 December 2012
గ్రామాలు
పల్లెటూరు
గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం(Hamlet) కంటే పెద్దది
చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలువిస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. షుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.
- రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
- అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకుకేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.
- అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.
- దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
గ్రామాల పేర్లు
ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పేర్లు వాటి పేర్ల తరువాత వచ్చే సఫిక్స్ లను చూస్తే వాటి వర్గీకరణ అర్థమౌతుంది. గ్రామాల పేర్ల తరువాత సాధారణంగా వచ్చే సఫిక్స్‌లు, పల్లె, తాండ, గూడెం, పురం (ఉదా: పిఠాపురం, పెద్దాపురం), పాలెం (ఉదా: సోంపాలెం, రావులపాలెం) ఊరు (ఉదా: పెనుమూరు, పుంగనూరు, రావూరు), సముద్రం (ఉదా: నల్లసముద్రం, రామసముద్రం), చెరువు (ఉదా: నల్లజెరువు, దేవలచెరువు) వగైరా
పల్లెటూరి అందాలు
పిచ్చుక గూళ్ళు – గిజిగాడి గూళ్ళు
![]() |
పిచ్చుక గూళ్ళు – గిజిగాడి గూళ్ళు |
![]() |
| లేగదూడలు |
![]() |
| స్వచ్ఛంగా ఉన్నాయి ఆ పల్లె పైరులూ, గాలీ, నీరూ...అన్నీ |
Sunday, 28 October 2012
రాజా రామమోహనరాయ్
|
రాజా రామమోహనరాయ్
![]()
రాజారామమోహన్ రాయ్ 1772 మే 22 న బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు. తండ్రి రమాకాంత్ రాయ్ ముర్షీదా బాద్ పాలకులైన మహమ్మదీయుల ఆస్థానంలో పనిచేసేవాడు. తల్లి ఠాకూరాణి సనాతనురాలు. రామమోహనరాయ్ ప్రాధమిక విద్యను ఆ గ్రామంలోనే అభ్యసించాడు. తరువాత పాట్నాకు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. చిన్నతనం నుంచే అతను ఖురాన్, బైబిలు, భగవద్గీత క్షుణ్ణంగా చదివాడు. అంతేకాదు ఆయా గ్రంధాల లోతుపాతుల్ని గ్రహించాలనే జిజ్ఞాసతో, అరబ్బీ భాషను, సంస్కృత భాషను, ఇంగ్లీషును అభ్యసించి, ఆయా మతాలకు సంబంధించిన ఇతర గ్రంధాలను అధ్యయనం చేశాడు. ఒకప్పుడు భారతదేశంలోని స్థితిగతులను చూసిన వారెవ్వరూ ఇంతటి మార్పు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరేమో?
ఆ రోజుల్లో సాంఘీక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. చాందస సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, అవివేకంతో కూడిన ఆచారాలు, నిరక్షరాస్యత దేశ జీవన వాహినికి అడ్డుగోడలై అంధకారమయిపోయింది. దానికితోడు బ్రిటీష్ దొరల పెత్తనం, మన దేశ ప్రజలను సాంఘీకంగా, రాజకీయంగా పెరగనివ్వకుండా, మూఢ నమ్మకాల వలయంలో కూరుకుపోవడానికీ అవకాశం కలిగించి, ప్రజలను మరింత చీకట్లోకి పడవేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అటువంటి సమయంలో వెలుగు రేఖలా అవతరించాడు "మహా మనిషి" రాజా రామమోహన రాయ్. "ప్రముఖ సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, యుగకర్త" గా కొనియాడబడిన మహా వ్యక్తి. మన ఆచారాల విషయంలో గుడ్డి నమ్మకాలు, జుగుప్స కలిగించే విశ్వాసాలు, అజ్ఞానంతో కూడిన ఆచారాలు, పాప విముక్తి కొరకు ఆచరించే అనేక ప్రక్రియలు రాం మోహన్ రాయ్ కి ఎంతో చికాకు కలిగించాయి. ఒక మతానికి చెందినవారు ఇతర మతాలకు చెందిన వారిపై నిందారోపణలు చేయటం, బహిరంగంగా విమర్శించుకోవటం, ముష్టి యుద్ధాలకు దిగటం ఆయన సహించలేకపోయాడు. ఆయన ఉద్దేశంలో "దేవుడనే వాడు ఒకడే. ఏ మతమైనా, కులమైనా అందరూ ఆరాధించేది ఒకరినే. అందరి పూజలూ ఆయనకే చేరుతాయి. మతాలన్నీ కలసి పోయి విశ్వమతం ఏర్పడాలి "ఆ ఆలోచనలే ఆయన బ్రహ్మ సమాజం స్థాపించడానికి పురికొల్పాయి. రాయ్ హిందువు అయినప్పటికీ, హిందూ మతంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించేవాడు. ఆ సమయంలోనే వాటిని ఖండిస్తూ ఒక వ్యాసం రాసినప్పుడు తండ్రికి కోపం వచ్చి, అతనిని ఇంటి నుండి గెంటివేశాడు. అయినా, రాయ్ చలించక, తన దేశ ప్రజలు బాగుపడాలంటే మూఢ విశ్వాసాలను వదిలి, బాగా చదువుకొని జ్ఞానం సంపాదించి తెల్లదొరల బానిసత్వపు చెరను తప్పించుకొని, స్వతంత్రంగా బతకాలని భావించి తన భావి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ రోజుల్లో భారతదేశంలో మతం పేరిట పీడిస్తున్న దురాచారాలలో "సతీసహగమనం" ముఖ్యమైనది. భర్త మరణించగానే అతని శరీరం దహనం చేసేటప్పుడు భార్య కూడా ఆ మంటల్లోకి దూకి దహనమయ్యే అనాగరిక చర్యను అప్పటి ప్రజలు ఎంతో పవిత్ర కార్యక్రమంగా భావిస్తూండేవారు. రాయ్ ఆ చర్యను ఖండించినప్పుడు ఎందరో పెద్దల ఆగ్రహానికి, అసంతృప్తికి గురి అయ్యాడు. అయినా పట్టువిడువక, బ్రిటీష్ దొరలతో పోరాడి "సతి"ని నిషేధించమని హవుస్ ఆఫ్ కామన్స్ కి ఒక విజ్ఞాపనపత్రం సమర్పించాడు. అయితే అప్పటి ప్రభుత్వం ఆ విజ్ఞాపనను తిరస్కరించింది. రాయ్ విజ్ఞాపనను అంగీకరిస్తే అతను ఇంకా అనేక సంఘ సంస్కరణలు తలపెట్టి ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాడేమోననే భయం వారిలో ఎక్కువగా ఉండేది. భారతీయులు సాంఘీకంగా గానీ, రాజకీయంగా గానీ విజ్ఞానపరంగా గానీ చైతన్యవంతులుకావటం వారి కిష్టంలేదు. హిందూ స్త్రీలకు "సతి" దురాచారం ద్వారా అన్యాయం జరుగకుండా కాపాడటమే కాకుండా, స్త్రీలకు వారి తండ్రి, భర్తల ఆస్తిలో హక్కు ఉండాలని కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ మోహన రాయే. 1823లో "హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ" అనే గ్రంధం కూడా రాసి సంచలనం సృష్టించాడు. రాయ్ సంఘ సంస్కర్తగా తన విధి నిర్వహణలో అష్టావధానం చేశాడు. విద్య, సంగీతం, సాహిత్యం, రాజకీయం, విశ్వమత ప్రచారం, ప్రజల ప్రతినిధిగా, మూఢ విశ్వాసాలను ఖండించే వ్యక్తిగా అనేక రంగాలలో కృషి చేశాడు. రాయ్ బెంగాలీ బాషలో "బెంగాలీ భాషా వ్యాకరణం" రాశాడు. దాన్ని 1833లో కలకత్తాలో ప్రచురించారు. అనంతరం పాఠశాలలో పాఠ్యయగ్రంథంగా ప్రవేశపెట్టడం జరిగింది. మతానికి సంబంధించిన అనేక గీతాలు రాశాడు. ఆ రోజుల్లోనే పత్రికా రంగానికి ఎంతో చేయూతనిచ్చిన ఘనత కూడా రాయ్ కే దక్కింది. కలకత్తాలో ప్రారంభమయిన తొలి పత్రిక "బెంగాల్ గెజెట్"ను 1916 నుండి 1920 దాకా రాయ్ శిష్యులే నిర్వహించారు. కాలక్రమాన రాయ్ సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని పరిశీలించిన ఢిల్లీ పాలకులు తమ తరపున, బ్రిటీష్ ప్రభుత్వంతో పనిచేయమని కోరారు. ఢిల్లీ చక్రవర్తి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అనేకపర్యాయాలు ఇంగ్లాండువెళ్ళి రాజుకి, బ్రిటీషు ప్రభుత్వానికి ఉన్న విభేదాలను తొలగించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవకు, విజ్ఞానానికి, తెలివితేటలకు, సమయస్ఫూర్తికి , స్వామి భక్తికి బ్రిటీషు వారు కూడా విస్తుపోయారు. ఢిల్లీ చక్రవర్తి ఆయన సేవలకు మెచ్చి "రాజా" అనే బిరుదు నిచ్చాడు. అప్పటి నుండి ఆయన రాజా రామమోహన్ రాయ్ అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనను, ఆయన భావాలను అర్ధం చేసుకున్నవారు చాలా తక్కువ. చాలామంది ప్రజలు ఆయనను కఠినంగా తిరస్కరించారు. రాజా రామమోహన్ రాయ్ ఆశయసిద్ది కొరకు చివరి వరకు పోరాడారు. 1833 సెప్టెంబర్ 27న రాయ్ స్వర్గస్థుడయ్యాడు.రాజారామమోహన్ రాయ్ జీవించి వుండగా తన ఆశయాలను ఆచరణ రూపంలో చూడలేకపోయినా ఆయన తదనంతరం ప్రజలే వాటిలోని సత్యాన్ని గ్రహించి ఆయనను"యుగకర్తగా" కీర్తించి, ఆయన అడుగు జాడలలో నడుచుకుంటున్నారు.
మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్.
|
అరిస్టాటిల్
అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటో కి శిష్యుడు మరియు అలెగ్జాండర్ కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.[1]. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం
ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడని ప్రతీతి. విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవుపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంధాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు. అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు.విజ్ఞానార్జన, విద్యాబోధన
అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో ప్లేటో అకాడమీ లో చేరి ప్లేటో కు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ప్లేటో చనిపోయిన తరువాత అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన మాసిడోనియాకు చేరాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ ఏథెన్స్ చేరుకుని ప్లేటో అకాడమీ కి పోటీగా లైజియం అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.ఆరిస్టాటిల్ భావవాదం
ఆరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని నమ్మేవాడు. ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు.మరణం
అలెగ్జాండర్ మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయాడు. అక్కడ ఒక ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీ.పూ. 322లో కాలధర్మం చెందాడు.అలెగ్జాండర్
అలెగ్జాండర్
అలెగ్జాండర్ (గ్రీకు Αλέξανδρος ο Μέγας, మెగాస్ అలెగ్జాండ్రోస్, జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323) గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు.
భారతదేశంపై దాడి
క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు. ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు. [1]
అనేక కథనాలు
అలెగ్జాండర్ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి, చరిత్రకారుడైన కాలిస్థెనిస్ తన రచన సిలీషియా లో ఒక సముద్రం గురించి మరియు అలెగ్జాండర్ గురించి వ్రాసాడు. (Plutarch, Alexander' 46.2)బైబిలులో ప్రస్తావన
డేనియల్ 8:5–8 మరీయు 21–22 లలో ఒక రాజు గురించి ప్రస్తావింపబడినది. ఈ రాజు మిడిస్ మరియు పర్షియాలను జయిస్తాడని, తరువాత అతడి సామ్రాజ్యం నాలుగు భాగాలుగా విభజింపబడుతుందని వ్యాఖ్యానింపబడినది. ప్రస్తావింపబడిన రాజు అలెగ్జాండరేనని కొందరు భావిస్తున్నారు.[ఆధారం కోరబడినది]
ఖురాన్ లో ప్రస్తావన
- ప్రధాన వ్యాసం: ఖురాన్ లో అలెగ్జాండర్
ఖురాన్ లో ఒక సత్ప్రవర్తన గల పాలకుడి దుల్-ఖర్నైన్ లేదా జుల్-ఖర్నైన్ గురించి ప్రస్తావింపబడినది. అరబ్ మరియు పర్షియన్ ప్రపంచంలో ఈ దుల్-ఖర్నైన్, అలెగ్జాండరేనని భావిస్తున్నారు. కానీ కొందరు ధార్మిక చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో విభేదించి, దుల్-ఖర్నైన్ రాజు పర్షియాకు చెందిన సైరస్ రాజు అని భావిస్తున్నారు.
"షాహ్ నామా" లో
Subscribe to:
Posts (Atom)



























